![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-7 మరో రెండు రోజుల్లో ముగుస్తుండటంతో హౌస్ లో ఉన్న ఆరుగురు మంచి స్నేహితులుగా మారిపోయారు. హౌస్ లో చివరి వేకప్ సాంగ్ గా.. హ్యాపీ డేస్ టైటిల్ సాంగ్ వేసి అందరిలో జోష్ ను నింపాడు బిగ్ బాస్. ఇక హౌస్ మేట్స్ అందరు ఇంటి భోజనం మిస్ అవుతున్నారని వారి కోసం ఫుడ్ ను తీసుకొచ్చాడు బిగ్ బాస్.
ఇక మొదటగా అర్జున్ కోసం అతని భార్య సురేఖ .. రాగి సంకటి, మటన్ కర్రీ చేసి పంపించింది. ఇక ఆ ఫుడ్ కావాలంటే యావర్ బాల్స్ ని స్డాండ్ మీద అయిదు నిమిషాల్లో ఫౌల్ ఆడకుండా పెట్టాలని చెప్పగా. అయిదు నిమిషాల్లో సరిగ్గా టాస్క్ ని పూర్తిచేసి యావర్ విజయం సాధించడంతో అర్జున్ కి ఫుడ్ లభించింది. ఆ తర్వాత శివాజీ కోసం అతని కొడుకు రిక్కీ చికెన్ ని పంపించాడు. ప్రియాంక టాస్క్ గెలవాలని చెప్పగా.. విల్లు మీద ఐరన్ బాల్స్ ని ఉంచాలని అది అయిదు నిమిషాల్లో పూర్తి చేసింది. ప్రియాంక గెలిచి చికెన్ కర్రీని శివాజీకి ఇచ్చింది. మూడవది అమర్ దీప్ కోసం రొయ్యల బిర్యానీ చేసి పంపింది తేజస్విని గౌడ. ఇక అది కావాలంటే శివాజీ తల మీద బర్త్ డే క్యాప్ ధరించి పైన ఉన్న బెలూన్స్ ని అయిదు నిమిషాల్లో పూర్తి చేయాలని చెప్పగా.. అతను గెలిచాడు. ఆ తర్వాత తేజస్విని పంపిన రొయ్యల బిర్యానీ అమర్ దీప్ కి ఇచ్చాడు. బిగ్ బాస్ హౌస్ లోకి ఏలియన్స్ వచ్చారు. వారికి శివాజీ కాఫి చేసాడు. మేం కాఫీ తాగామని సింక్ లో కాఫీ పారబోసారు ఏలియన్స్. ఆ తర్వాత వారితో పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ సరదాగా గడిపారు హౌస్ మేట్స్.
ఇక ఆ తర్వాత అసలు పరీక్ష పెట్టాడు బిగ్ బాస్. మీ 14 వారాల జర్నీలో మీ ఓవరాల్ పర్ఫామెన్స్ ఆధారంగా అంటే మీ టాస్కులు, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ దృష్టిలో పెట్టుకొని 60 నిమిషాల ఎపిసోడ్‌లో మీరు ఎంత సేపు కనిపించడానికి అర్హులో అందుకు సంబంధించిన కారణాలు చెప్పాలని బిగ్‌బాస్ అన్నాడు. అలానే మిగతా ఇంటి సభ్యులకి కూడా ఎవరికి ఏ టైమ్ ఇవ్వాలని భావిస్తే వాళ్లకి ఆ టైమ్ కార్డ్ ఇచ్చి తగిన కారణాలు చెప్పాలని బిగ్ బాస్ అన్నాడు. ఇలా మెజార్టీ ఇంటి సభ్యుల నిర్ణయం ఆధారంగా వారు ఆ టైమ్ కార్డ్ ధరించాల్సి ఉంటుందని చెప్పాడు. ఇక ముందుగా అర్జున్ మొదలుపెట్టాడు. ముందుగా అర్జున్ తనకి తాను 10 ఇచ్చుకున్నాడు. ఆ తర్వాత శివాజీకి 15, ప్రియాంకకి 7, యావర్ 5, ప్రశాంత్ 3 ఇచ్చి రీజన్స్ ఇచ్చాడు అర్జున్. ఇక ఆ తర్వాత వచ్చిన అమర్ దీప్ తనకి తాను 15 ఇచ్చుకున్నాడు. అర్జున్ కి 3, ప్రియాంకకి 7, యావర్ 5, ప్రశాంత్ 10, శివాజీకి 20 ఇచ్చాడు అమర్ దీప్. అమర్ దీప్ కి 3 ఇచ్చాడు శివాజీ. ప్రియాంకకి 10, అర్జున్ 7, యావర్, ప్రశాంత్ ఇద్దరికి 15, 20 మార్కుల బోర్డ్ లు ఇచ్చి మీరే వేసుకోండిరా అని శివాజీ చెప్పాడు. ఇలా అందరు హౌస్ మేట్స్ కి మార్కులు ఇచ్చుకున్నారు. కొన్ని చిన్న చిన్న గొడవలు జరిగాయి.
![]() |
![]() |